Akkineni Akhil | పవన్ కళ్యాణ్ దర్శకుడితో అఖిల్ నెక్స్ట్ చిత్రం?
Akkineni Akhil Next Movie | అక్కినేని నట వారసుడు అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.
‘ఓ మై ఫ్రెండ్’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్. గతేడాది వచ్చిన ‘వకీల్‌సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించాడు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌ను వేణు హండిల్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వకీల్ సాబ్ తర్వాత ఇప్పటివరకు ఈయన తదుపరి సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈయన అఖిల్ నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇప్పటికే అఖిల్‌కు కథ వినిపించినట్టు, ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం వేణు స్క్రిప్ట్‌ను పూర్తి చేసేపనిలో ఉన్నాడు. ఏజెంట్ పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్నాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

