Rao Bahadur | అఖిల్ ‘లెనిన్’ వాయిదా.. రేసులోకి సత్యదేవ్ ‘రావు బహదూర్’?
AkhilAkkineni | ఈ ఏడాది జూన్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఎంతో కీలకంగా మారింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ఒక వైపు సందడి చేస్తుండగా.. జూన్ రెండోవారం సింగ్ గీతం తప్ప పెద్ద సినిమాలేవి లేకపోవడంతో పెద్ది కలిసివస్తుంది.
Lenin | ఈ ఏడాది జూన్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఎంతో కీలకంగా మారింది. ఒకవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. జూన్ రెండోవారంలో కేవలం చిన్న చిత్రాలే ఉండటంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ రన్ సులువైంది. అయితే జూన్ చివరివారంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం మొదట ప్రకటించింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వలన ఈ చిత్రం వాయిదాపడినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.
అయితే ‘లెనిన్’ సినిమా రేసు నుండి పక్కకి తప్పుకోవడంతో జూన్ 26వ తేదీన బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద స్లాట్ ఖాళీ అవుతోంది. ఇప్పుడు ఈ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యమైన చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక కీలక భాగస్వామిగా (నిర్మాతగా) వ్యవహరిస్తుండటంతో దీనిపై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.
నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే నెల జూలై 3వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ గతంలో డేట్ లాక్ చేశారు. కానీ ఇప్పుడు అఖిల్ సినిమా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుండటంతో, ‘రావు బహదూర్’ చిత్రాన్ని వారం రోజుల ముందే, అంటే జూన్ 26నే థియేటర్లలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఈ నెలలో రేసులో మరే పెద్ద సినిమా లేకపోవడం, పైగా సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉండటం ‘రావు బహదూర్’ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మరి ఈ ఊహాగానాలపై చిత్ర నిర్మాతలు ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

