Akhil | అఖిల్ – జైనాబ్ తొలి వివాహ వార్షికోత్సవం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫోటోలు
Akhil | అక్కినేని కుటుంబంలో నేడు ప్రత్యేకమైన రోజు. యువ హీరో అఖిల్, ఆయన సతీమణి జైనబ్ తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గతేడాది జూన్ 6న వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, నేడు తమ పెళ్లి జీవితంలో తొలి ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Akhil | అక్కినేని కుటుంబంలో నేడు ప్రత్యేకమైన రోజు. యువ హీరో అఖిల్, ఆయన సతీమణి జైనబ్ తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గతేడాది జూన్ 6న వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, నేడు తమ పెళ్లి జీవితంలో తొలి ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియస్ తమ సోషల్ మీడియాలో అఖిల్-జైనాబ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకుంది. “హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ” అంటూ షేర్ చేసిన ఈ చిత్రాలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలోని మధుర క్షణాలు మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
గత ఏడాది జూబ్లీహిల్స్‌లోని అక్కినేని కుటుంబ నివాసంలో అత్యంత వైభవంగా అఖిల్-జైనాబ్ల వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక అప్పట్లో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. సంప్రదాయం, ఆధునికత కలగలిపిన ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో ఎంత వైరల్ అయ్యాయో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్న అఖిల్, మరోవైపు తన సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యలక్ష్మీ భోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల అనంతరం అఖిల్ పూర్తిస్థాయిలో ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రాన్ని అఖిల్ కెరీర్లో కీలకంగా భావిస్తున్నారు. జూన్ 26న విడుదల కానున్న ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Amala
- Anniversary
- Chiranjeevi
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

