most eligible bachelor leharaayi song | అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. GA 2 బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పోస్టర్, టీజర్ సహా పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇక ఈ మధ్య విడుదలైన లెహరాయి లిరికల్ సాంగ్ యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పాట 4 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
గోపీ సుందర్ అద్భుతమైన సంగీతానికి తోడు సిధ్ శ్రీరామ్ మధురమైన స్వరం లెహరాయి పాటను సూపర్ డూపర్ హిట్ చేసింది. అంతేకాదు ఈ పాటలో పూజా హెగ్డే అత్యద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆమె రొమాంటిక్ స్టిల్స్ పాటకు అదనపు ఆకర్షణ. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న లిరికల్ సాంగ్‌లో పూజాహెగ్డే కనిపించిన ప్రతిసారి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇదే లెహరాయి పాటను చార్జ్ బస్టర్‌గా నిలిపింది. పాటలో విజువల్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికే యూ ట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..
Nandita: హీరోయిన్ తండ్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
త్రిష, కీర్తి సురేష్‌లతో సమంత వీకెండ్ మస్తీ
Sekhar Kammula | లవ్ స్టోరీకి రిపీట్ ఆడియెన్స్ ఖాయం: శేఖర్ కమ్ముల