మహా కుంభమేళాలో అఖండ తాండవం
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని, రీసెంట్గా ‘డాకు మహారాజ్'తో డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘అఖండ తాండవం’. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని, రీసెంట్గా ‘డాకు మహారాజ్’తో డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘అఖండ తాండవం’. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందమూరి తేజస్విని సమర్పకురాలు. ఈ చిత్రం షూటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో ఈ రోజున ఘనంగా మొదలైంది. కీలకమైన సన్నివేశాలను కుంభమేళాలో చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయని, దానికి తగ్గట్టే పానిండియా స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ విలన్‌గా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే, సంగీతం: థమన్ ఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

