Thunivu Movie | ఇయర్ ఎండింగ్‌కు అజిత్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్..!
ప్రతి సినిమాకు అజిత్ తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటి వరకు కోటీ రూపాయల మార్కెట్ కూడా లేని అజిత్.. ‘వలిమై’ సినిమాతో రెండు కోట్లకు పైగా మార్కెట్ పెంచుకున్నాడు.
Thunivu Movie Trailer | ప్రతి సినిమాకు అజిత్ తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటి వరకు కోటీ రూపాయల మార్కెట్ కూడా లేని అజిత్.. ‘వలిమై’ సినిమాతో రెండు కోట్లకు పైగా మార్కెట్ పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు తునివు సినిమాతో ఏకంగా రూ.3 కోట్ల ప్రీ బిజినెస్‌తో రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అజిత్ లుక్స్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. తెలుగులో తెగింపు పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. తునివి ట్రైలర్ డిసెంబర్ 31న రిలీజ్ కానుంది. ఈ అప్డేట్తో అజిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒకరోజు ముందుగానే న్యూ ఇయర్ వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలుగు ట్రైలర్ కూడా అదే రోజు రిలీజవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరెకెక్కిన ఈ సినిమాలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్‌పై బోనీ కపూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇక గతంలో హెచ్. వినోద్, అజిత్ కాంబోలో తెరకెక్కిన వలిమై, విశ్వాసం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి హిట్టవుతుందని చిత్ర యూనిట్ దీమాగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

