Bholaa movie | రీమేక్‌తో సై అంటున్న అజయ్ దేవగన్.. భోళా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కార్తి నటించిన 'ఖైదీ'మూవీకి రీమేక్‌గా రూపొందుతుంది. పెరోల్ పై విడుదలైన ఒక ఖైదీ తన కూతురు కోసం కష్టాల్లో ఉన్న పోలీసుల్ని ఎలా ఆదుకున్నాడు అన్నదే కథాంశం.
Bholaa movie Release date | బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్లో బిజీయెస్ట్ నటులలో ఈయన ఒకడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గోంటాడు. ఇటీవలే ఈయన నటించిన దృశ్యం-2 రిలీజై సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.300 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ‘భోళా’ ఒకటి. అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో పెరోల్ పై విడుదలైన ఒక ఖైదీ తన కూతురు కోసం కష్టాల్లో ఉన్న పోలీసుల్ని ఎలా ఆదుకున్నాడు అన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కార్తీ ఢిల్లీ అనే పాత్రను పోషించాడు. అదే పాత్రను అజయ్ దేవగణ్ భోళాగా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నమోదు చేశాయి. గతంలో ఈ సినిమాను ఓటీటీలోనే నేరుగా రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ కానుందని చిత్రబృందం తెలిపింది.
Ek Chattaan, Sau Shaitaan.
Iss kalyug mein aa raha hai #Bholaa, 30th March 2023.#Bholaain3D #Tabu pic.twitter.com/DoXKMutLtA
— Ajay Devgn (@ajaydevgn) December 20, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

