Shaitaan Movie | మాంత్రికుడిగా భయపెడుతున్న మాధవన్.. ఇంట్రెస్టింగ్గా అజయ్ దేవగన్ ‘షైతాన్’ ట్రైలర్
Shaitaan Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Shaitaan Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా సినిమా నుంచి చిత్రయూనిట్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన అజయ్ దేవగన్ కుటుంబం అక్కడ ఒక అపరిచిత (మాధవన్) వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అయితే ఆ అపరిచిత వ్యక్తి ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేది అనేది అసలు కథ. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు. గుజరాతీ హారర్ థ్రిల్లర్ ‘వష్’ (Vash) సినిమాకు ఈ చిత్రం రీమేక్గా వస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

