Raid 2 Movie | అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ టీజర్ రిలీజ్
Raid 2 Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది.
Raid 2 Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొదట ఫిబ్రవరి 21 2025 మహాశివరాత్రి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అనుకొని కారణాల వలన వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఇన్కమ్ టాక్స్‌లో సీనియర్ అధికారి అయిన అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) అటు రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ మ్యాన్ల ఇంటిపై రైడ్లు చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తుంటాడు. అయితే అమయ్ పట్నాయక్‌కి ఒక రాజకీయ నేత ఇంటిపై ఐటీ రైడ్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశం వస్తుంది. ఈ క్రమంలోనే రైడ్ చేయడానికి ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

