ప్రశ్నలు అడిగినప్పుడే సమాధానాలొస్తాయి!
వేర్వేరు నగరాల్లో ఆపరేషన్స్ నిర్వహించిన పోలీస్ అధికారులందరూ ‘అవెంజర్స్' తరహాలో చివర పార్ట్‌లో భాగమవుతారని దర్శకుడు చెప్పిన పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది.
కథాంశాల పరంగా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు అడివి శేష్. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారాయన. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హిట్-2’. శైలేష్ కొలను దర్శకుడు. వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం పాత్రికేయులతో ముచ్చటించారు అడివి శేష్. ఆయన చెప్పిన సంగతులివి..
దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన అంశాలేమిటి?
వేర్వేరు నగరాల్లో ఆపరేషన్స్ నిర్వహించిన పోలీస్ అధికారులందరూ ‘అవెంజర్స్’ తరహాలో చివర పార్ట్‌లో భాగమవుతారని దర్శకుడు చెప్పిన పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా మరిన్ని భాగాలు రాబోతున్నాయి. చివరి భాగాన్ని ‘అవెంజర్స్’ తరహాలో ప్రజెంట్ చేయాలన్నది దర్శకుడి ఆలోచన. ‘హిట్-2’ కథలోని యూనిక్ పాయింట్, కథాగమనంలోని సస్పెన్స్ కొత్తగా అనిపించడంతో ఈ చిత్రాన్ని అంగీకరించా.
స్వతహాగా మీరు కూడా రచయిత కాబట్టి సినిమా స్క్రిప్ట్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. ఈ సినిమా విషయంలో ఏమైనా సలహాలు ఇచ్చారా?
గత నాలుగైదు సినిమాల స్క్రిప్ట్ రూపకల్పనలో నేనూ భాగమయ్యాను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కేవలం నటన వరకే పరిమితమయ్యా. కథ, స్క్రిప్ట్ మేకింగ్ విషయాల్లో దర్శకుడే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సినిమా కథా చర్చల్లో దర్శకుడు శైలేష్‌ను చాలా ప్రశ్నలడిగారని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు..?
సాధారణంగానే నేను డౌట్స్ ఎక్కువగా అడుగుతుంటా. అలా ప్రశ్నలు అడిగినప్పుడే సమాధానాలు దొరుకుతాయి (నవ్వుతూ).
ఇలాంటి క్రైమ్ చిత్రాలు హింసను గ్లోరిఫై చేస్తాయనే విమర్శలున్నాయి. వీటిపై మీరేమంటారు?
స్వతహాగా నాకు హారర్, క్రైమ్, డ్రగ్ సంబంధించిన కథలు అస్సలు ఇష్ట ఉండదు. ‘హిట్-2’లో హింసను గ్లోరిఫై చేసినట్లుగా ఎక్కడా కనిపించదు. పైగా మహిళల కోణంలో కథ భావోద్వేగాలతో నడుస్తుంది. చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందనే సందేశం ఉంటుంది.
ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ చేయబోతున్నారని తెలిసింది. హిందీ వెర్షన్ రిలీజ్ ఎప్పుడుంటుంది?
హిందీ వెర్షన్‌కు నేనే డబ్బింగ్ చెబుతున్నా. చక్కటి క్వాలిటీతో హిందీ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ నెల 13న హిందీలో విడుదల చేస్తాం.
మీ తదుపరి చిత్రాల గురించి..
అన్నపూర్ణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నా. ‘గూఢచారి-2’ స్క్రిప్ట్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆస్కార్ అవార్డు పొందిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం. ఆ చిత్రంలో నేను నటిస్తున్నా. భారీ స్థాయిలో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adivi sesh
- hit 2
- Shailesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

