Dacoit Trailer | టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, అందాల నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ రివెంజ్ అండ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ (Dacoit). ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఎప్పుడూ థ్రిల్లర్ కథలతో మెప్పించే అడివి శేష్ ఈసారి పూర్తి భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్)ల మధ్య గాఢమైన ప్రేమ కథతో మొదలైన ట్రైలర్.. ఆ తర్వాత ఊహించని నమ్మకద్రోహం, జైలు జీవితం, రివెంజ్ డ్రామాగా మారి ఉత్కంఠ రేపుతోంది. ఒక సాధారణ ప్రేమికుడు పరిస్థితుల ప్రభావం వల్ల ‘డెకాయిట్’గా ఎలా మారాడనేదే ఈ చిత్ర ప్రధానాంశంగా తెలుస్తోంది. ఈ చిత్రంతో షానీల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ టాలీవుడ్లోకి అడుగు పెడుతుండగా వీరితో పాటు ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో హైలైట్గా నిలిచింది.