Director shankar Daughter | దిగ్గజ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి తమిళనాట రోజు రోజుకు సంచలనంగా మారిపోయింది. ఇప్పటికి ఆమె చేసింది రెండు సినిమాలే. కానీ రెండు బంపర్ హిట్లే. ఏడాది కిందట కార్తితో విరుమన్ సినిమా చేసి నటిగా తొలిసినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలే విడుదలైన మహవీరుడుతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అదితి శంకర్ రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచింది. అందులో ఒకటి షూటింగ్ దశలో ఉండగా.. మరోటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఓ బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది.
ఆకాశం నీ హద్దురాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న టీమ్ మరోసారి క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతున్నారు. కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా అదితిశంకర్ నటించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిశాయట. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జీ.వి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఇక సూర్య ప్రస్తుతం కంగువాతో బిజీగా ఉన్నాడు. శౌర్యం ఫేమ్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వెట్రమారన్తో వడివాసాల్ చేయనున్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాత సుధా కొంగరతో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.