Top Gear Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న టాప్ గేర్ మూవీ ట్రయిలర్..!
ప్రస్తుతం ఆది సాయికుమార్ క్రేజ్ ఎలా ఉన్నా వరుస పెట్టి సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Top Gear Movie Trailer |హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. ఆందులో ‘టాప్ గేర్’ ఒకటి. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ మొత్తం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు డేవిడ్ గురించి వెతుకుతూ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అసలు డేవిడ్ ఎవరు? డేవిడ్ వల్ల ఆది ఎలా చిక్కుల్లో పడ్డాడు? చివరికి డేవిడ్ దొరికాడా? అనే చాలా ప్రశ్నలను ట్రైలర్ సంధిస్తున్నాయి. ట్రైలర్ చివర్లో అసలు ఎవర్రా మీరు .. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు అని ఆది చెప్పే డైలాగ్ ఆసక్తిని క్రియేట్ చేసింది. హర్షవర్ధన్ నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తుంది. సాయి శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్, శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కే.వి శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆది క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఆదికి జోడీగా రియా సుమన్ నటిస్తున్నాడు. బ్రహ్మాజి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

