తేజ సజ్జా,శివాని ‘అద్భుతం’.. ఫస్ట్ లుక్ విడుదల

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ‘జాంబీరెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయమైన తేజ సజ్జా మంచి జోరు మీదున్నాడు. వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇటీవల మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ‘ఇష్క్’-‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమా కంప్లీట్ చేశాడు. ఎస్.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్గా ప్రశాంత్ వర్మతో హను మాన్ అనే సినిమా మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
మల్లిక్ రామ్ డైరెక్షన్లో తేజ.. శివానీ రాజశేఖర్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. అద్భుతం అనే టైటిల్‌తో చిత్రం రూపొందుతుండగా, సినిమా పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇది ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా అని తెలుస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే ,మాటలు రాస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Adbhutham
- shivani
- teja sajja
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

