Ante sundaraniki | ‘అంటే సుందరానికీ’ చిత్రానికి నజ్రియా రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
Nazriya Remuneration | నజ్రియా నజిమ్.. ‘రాజారాణి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, బ్రదర్ బ్రదర్ అంటూ క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఈ చిత్రం తర్వాత నజ్రియా నేరుగా తెలుగులో ఎప్పుడెప్పుడు నటిస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ క్రమంలో ‘అంటే సుందరానికీ’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అని అనౌన్స్మెంట్ రావడంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల నడుమ జూన్ 10న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం అంతగా జోరు చూపించలేకపోయింది.
కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో నాని, నజ్రియా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు వీళ్ళ సీన్స్ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.16 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం నజ్రియా తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నజ్రియా ఈ చిత్రంలో నటించడానికి రూ.2 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సామానంగా ఈమె రెమ్యునరేషన్ తీసుకుంది.
ఇక నాని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి. ఈ విషయంలో నాని కాస్త ఆలోచించాలని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. నాని కథల ఎంపిక, డైరెక్టర్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కామెంట్స్ చేస్తున్నారు. నాని గత సినిమాలు చూసుకుంటే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగా తగ్గాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

