అలాంటి సినిమాలు చేయాలని ఉంది : కృతి శెట్టి
తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే ఘన విజయాన్ని అందుకుని టాలీవుడ్లో నాయికగా స్థిరపడిపోయింది అందాల తార కృతిశెట్టి. ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్' ‘బంగార్రాజు’తో తెరపైకి వచ్చిన ఈ హీరోయిన్...తాజాగా హీరో రామ్ సరసన ‘ది వారియర్' సినిమాలో నటించింది.
Krithi Shetty | తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే ఘన విజయాన్ని అందుకుని టాలీవుడ్లో నాయికగా స్థిరపడిపోయింది అందాల తార కృతిశెట్టి. ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్’ ‘బంగార్రాజు’తో తెరపైకి వచ్చిన ఈ హీరోయిన్…తాజాగా హీరో రామ్ సరసన ‘ది వారియర్’ సినిమాలో నటించింది. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్నది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది కృతి శెట్టి..
ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటించడం ఎలా ఉంది?
‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి వెను వెంటనే రిలీజ్ అయ్యాయి. వాటితో చూస్తే ‘ది వారియర్’ సినిమా కాస్త ఆలస్యంగా తెరపైకి వస్తున్నది. గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ కలుగుతున్నది.
ఈ కథ వినగానే మీ ఫీలింగేంటి?
లింగుస్వామి దర్శకత్వం వహించిన ‘ఆవారా’ సినిమాను గతంలో చాలాసార్లు చూశాను. అప్పటికి నేను చదువుకుంటున్నాను. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తే ఆ సీడీ తీసుకెళ్లి రోజులో రెండు మూడు సార్లు చూసేదాన్ని. అదొక మంచి జ్ఞాపకంలా మిగిలింది. ఈ సినిమా కోసం లింగుస్వామి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని తెలియగానే ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఆయన సినిమాల్లో వినోదంతో పాటు నాయికకు ప్రాధాన్యత ఉంటుంది. కథ విన్నాక మరింత సంతోషం కలిగింది.
ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు హిట్టయ్యాయి, ఈ పాటలు చేసిన అనుభవాలు చెప్పండి?
బుల్లెట్ సాంగ్ చేస్తున్నప్పుడు డ్యాన్సుల్లో రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయగలనా లేదా అని భయమేసింది. కానీ పాట చిత్రీకరణ మొదలయ్యాక ఆ జోష్‌లో చేశాం. విజిల్ పాట ఎప్పుడు విన్నా నాలో ఉత్సాహాన్ని తీసుకొస్తుంటుంది.
ఈ కథలో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనొక రేడియో జాకీ. ఈ క్యారెక్టర్ వింటున్నప్పుడు మంచి ఫీలింగ్ కలిగింది. ప్రేక్షకులూ అదే అనుభూతి చెందుతారు. సినిమా చూస్తున్నంత సేపు పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో ఇది భిన్నమైనది. ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఆమె మాటలకే విజిల్ వేస్తారు. దర్శకుడు లింగుస్వామి ఎలా నటించాలో వివరంగా చెబుతారు. దాంతో నటించడం సులువైంది.
పోలీస్‌కు ఆర్జేకు లవ్ ఎలా కుదిరింది?
పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ మా లవ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా విడుదలైన కంటెంట్ చూస్తే రామ్‌తో నా పెయిర్ బాగుంది అంటున్నారు. రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు చూశాను. ఈ సినిమాలు చూస్తూ తెలుగు నేర్చుకున్నాను. నేనూ రామ్‌లాగే ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటాను. ఆయనతో కలిసి నటించడం కష్టమేం అనిపించలేదు.
ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టడం ఎలా ఉంది?
‘ఉప్పెన’ సినిమా నుంచి నా మీద తమిళ ప్రేక్షకులు అభిమానం చూపిస్తున్నారు. ఏ ప్రేక్షకులకైనా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తెలుగుతో పాటు తమిళంలో చిత్రీకరణ జరిపారు. రెండు భాషల్లో చిత్రీకరణ నా కంటే రామ్‌కు కష్టమైంది. నేను లిప్ సింక్ చేశాను, రామ్ ప్రతి సీన్, డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్నా.
ఎలాంటి చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు?
నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. కొన్నేళ్ల తర్వాతైనా యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది. నాయిక ప్రధాన సినిమాలేవీ ఒప్పుకోలేదు.
ఆర్జే విజిల్ మహాలక్ష్మి పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు?
తెలుగు, ఇంగ్లీష్ రేడియో జాకీల వీడియోస్ చూశాను. వాళ్లు కనిపించకున్నా, మాటల ద్వారా వాళ్ల భావాలు పలికిస్తారు. అలా నటించేందుకు సాధన చేశాను. పాడ్ కాస్ట్ చేసే వాళ్ల వీడియోలూ పరిశీలించాను.
ఇప్పుడు చేస్తున్న సినిమాల గురించి
ఈ సినిమా తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా విడుదలవుతుంది. నాగ చైతన్యతో ఓ సినిమా, సూర్యతో మరో చిత్రంలో నటిస్తున్నాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

