సూర్యకు ఆస్కార్ పిలుపు
తమిళ హీరో సూర్య మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆస్కార్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.
తమిళ హీరో సూర్య మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆస్కార్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం అందుకున్న తొలి హీరో సూర్యనే కావడం విశేషం. ఈసారి ఆస్కార్ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 397 మంది సినీ ప్రముఖులను ఆర్గనైజింగ్ కమిటీకి ఎంపిక చేశారు. బాలీవుడ్ నుంచి నటి కాజోల్, దర్శకురాలు రీమా కగ్తి, సుస్మితా ఘోష్, రీంతు థామస్, నిర్మాత ఆదిత్య సూద్ ఉన్నారు. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమా భారత్ నుంచి 93వ ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్లగా, ‘జై భీమ్’ సినిమా 94వ ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపిక కాలేదు.
ఈ రెండు చిత్రాల ప్రభావమే సూర్యను ఆస్కార్ ఆర్గనైజింగ్ కమిటీలోకి ఆహ్వానించేలా చేసిందని తెలుస్తున్నది. ఇటీవల సూర్య ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. సినిమా విజయానికి కొసమెరుపు అయ్యారు. సూర్య ప్రస్తుతం బాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor surya
- jai bhim
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

