అదీ అన్నయ్యంటే!‘
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకత నిలుపుకుంటున్నారు హీరో సూర్య. ఆయన తన పాతికేళ్ల నట ప్రస్థానానికి చేరువయ్యారు. మణిరత్నం నిర్మించిన ‘నెరుక్కు నేర్’ 1997, సెప్టెంబర్ 6న రిలీజైంది. విజయ్, సిమ్రాన్, కౌసల్య ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సూర్య కెరీర్‌కు గట్టి పునాది వేసింది. ఇక అక్కడి నుంచి తనదైన కెరీర్ నిర్మించుకున్నారు సూర్య. ‘గజినీ’, ‘సింగం’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలు ఆయనకు స్టార్డమ్ తీసుకొచ్చాయి.
‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సత్తా చాటి ఐదు అవార్డులను గెల్చుకుంది. ఉత్తమ నటుడిగా సూర్యకు పురస్కారాన్ని అందించింది. సూర్య పాతికేళ్ల నట ప్రస్థానం సందర్భంగా సోషల్ మీడియాలో ‘25 ఇయర్స్ ఆఫ్ కల్ట్ సూర్యాయిజమ్’ అనే యాష్ ట్యాగ్‌తో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సోదరుడు కార్తీ స్పందిస్తూ…‘నటుడిగా ఎదిగేందుకు అన్నయ్య నిరంతరం శ్రమించారు. తన లోపాలను బలాలుగా మార్చుకున్నారు. ఏకాగ్రతతో నటించి పేరు తెచ్చుకున్నారు. వేలాది మంది పిల్లలకు విద్యను అందిస్తూ మంచి మనసు చాటుకున్నారు. అదీ మా అన్నయ్య అంటే’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సూర్య ‘వాడివాసల్’ సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor surya
- Kausalya
- Simran
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

