సవాళ్ల కోసం ఎదురుచూస్తుంటా

‘నటుడిగా ప్రేక్షకుల ఊహలకు భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వారిని సర్ప్రైజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటా’ అని అన్నారు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. డిసెంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటించిన విశేషాలు..
1979 బ్యాక్‌డ్రాప్‌లో స్కైలాబ్ పడిపోతున్నట్లుగా వచ్చిన పుకార్ల నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ఇది. జనాల భయాల్ని ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలని భావించే ఆనంద్ అనే డాక్టర్‌గా నేను ఈ సినిమాలో కనిపిస్తా. గౌరి, సుబేదార్ రామారావుతో అతడికి ఉన్న సంబంధమేమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. నా సినీ ప్రయాణంలో బాక్సాఫీస్ హిట్ అనే మాట ఇప్పటికీ వినలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరుతుందని అనుకుంటున్నా. కరీంనగర్‌లోని బండలింగపల్లి అనే ఫిక్షన్ విలేజ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 1979 కాలం నాటి తెలంగాణ యాసను ఉపయోగిస్తూ సింక్సౌండ్లో సినిమా చేశాం. ఈ విధానం వల్ల సన్నివేశాలు, సంభాషణలు మరింత రియలిస్టిక్‌గా వచ్చాయి. కథ, పాత్రల పరంగా సవాళ్ల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. ఇప్పటివరకు వెండితెరపై ఎవరూ చేయని వైవిధ్యమైన ప్రయత్నమిది. ఆ కొత్తదనం నచ్చే అంగీకరించా. ప్రస్తుతం హీరోగా ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’సినిమాలు చేస్తున్నా. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’తో పాటుగా హిందీలో అక్షయ్‌కుమార్ కీలక పాత్రలు చేస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

