అమితాబ్‌బచ్చన్ నాకు స్ఫూర్తినిచ్చారు
‘ఒక హిట్ సినిమా తర్వాత ఎలాగైనా మరో హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుంది. హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ కుదరాలి. ‘జైలర్' తర్వాత నేను అంతగా కథలు వినడం లేదు. కానీ దర్శకుడు జ్ఞానవేల్ చెప్పిన ఈ కథ నచ్చడంతో వెంటనే అంగీకరించా’ అన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన తాజా చిత్రం ‘వేైట్టెయాన్' ఆడియో రిలీజ్ వేడుక శుక్రవారం చెన్నైలో జరిగింది.
- ‘వేైట్టెయాన్’ ఆడియో వేడుకలో రజనీకాంత్
‘ఒక హిట్ సినిమా తర్వాత ఎలాగైనా మరో హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుంది. హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ కుదరాలి. ‘జైలర్’ తర్వాత నేను అంతగా కథలు వినడం లేదు. కానీ దర్శకుడు జ్ఞానవేల్ చెప్పిన ఈ కథ నచ్చడంతో వెంటనే అంగీకరించా’ అన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన తాజా చిత్రం ‘వేైట్టెయాన్’ ఆడియో రిలీజ్ వేడుక శుక్రవారం చెన్నైలో జరిగింది.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అమితాబ్ వంటి పెద్దస్టార్ భాగం కావడంతో నాలో ఉత్సాహం రెట్టింపయ్యింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అమితాబ్‌ను నేను స్ఫూర్తిగా తీసుకుంటా. ఓ సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆయన కెరటంలా పైకి లేచారు. 80 ఏండ్ల వయసులో కూడా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు.
ఫహాద్ ఫాజిల్, రానా ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు’ అన్నారు. రజనీకాంత్‌తో కలిసి నటించడం గర్వంగా భావిస్తున్నానని అమితాబ్ బచ్చన్ చెప్పారు. రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్ నుంచి ఎన్నో జీవిత సత్యాలను తెలుసుకున్నానని, అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని దర్శకుడు జ్ఞానవేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

