Ante Sundaraniki | నాని తన లైఫ్‌లో అలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడట!
Ante Sundaraniki | ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలని అనుకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
ప్రమోషన్లలో భాగంగా నాని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో నాని తన లైఫ్‌లో ‘జైభీమ్’ లాంటి సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా దళపతి విజయ్ సినిమలో కీ రోల్ చేస్తున్నట్లు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. వాటిని విని తను కూడా ఆశ్చర్యపోయానని తెలిపాడు. అంటే సుందరానికీ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

