Matthew Perry | ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి.. సంతాపం ప్రకటించిన మహేష్ బాబు
Matthew Perry | ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు ఫ్రెండ్స్(Friends). 1994లో స్టార్ట్ అయిన ఈ టెలివిజన్ సిరీస్ 2004 వరకు ప్రముఖ ఆంగ్ల టెలివిజన్‌లో ప్రసారమైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా చూసిన సిరీస్‌లలో ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ మొదటి స్థానంలో ఉంటుంది.
Matthew Perry | ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు ఫ్రెండ్స్(Friends). 1994లో స్టార్ట్ అయిన ఈ టెలివిజన్ సిరీస్ 2004 వరకు ప్రముఖ ఆంగ్ల టెలివిజన్‌లో ప్రసారమైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా చూసిన సిరీస్‌లలో ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఫ్రెండ్స్ వెబ్ సిరీస్‌లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మాథ్యూ పెర్రీ (54) శనివారం అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. లాస్ ఎంజెల్స్‌లోని పెర్రీ నివాసంలోని బాత్ టబ్‌లో అతడి మృతదేహాన్ని పోలీసులు కనుగోన్నారు. పెర్రీ మరణంపై విచారణ కొనసాగుతోన్నట్లు తెలిసింది. ఇక మాథ్యూ పెర్రీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులను విషాదంలోకి నెట్టింది.
మరోవైపు మాథ్యూ పెర్రీ అకాల మరణం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశాడు. ఈ జనరేషన్ ఓ మంచి ఫ్రెండ్‌ను కోల్పోయింది అంటూ మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
ఫ్రెండ్స్ వెబ్ సిరీస్‌లో చాండ్లర్ బింగ్ అనే పాత్రతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు మాథ్యూ పెర్రీ. తన కామెడీ టైమింగ్‌తో అమాయకత్వంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఈ పాత్రతో ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో జెన్నిఫర్ అనిస్టన్, కోర్ట్నీ కాక్స్, మాట్ లెబ్లాంక్, లిసా కుడ్రో మరియు డేవిడ్ ష్విమ్మర్ కూడా నటించారు. రీసెంట్గా 2021లో ఫ్రెండ్స్ రీయూనియన్ షో కూడా జరిగింది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

