Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Actor Brahmaji | ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Actor Brahmaji | ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో జరుగుతున్న వివిధ నిరసనలు, ఆందోళనలను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట పెద్దయెత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం నిరసన తెలపడం అనేది ఒక కొత్త వృత్తిగా (Protest is the new profession now) మారిపోయింది అంటూ బ్రహ్మాజీ ఒక పోస్ట్ పెట్టారు.
అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ.. ప్రజా సమస్యలపై, వ్యవస్థల తీరుపై నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ప్రజల పోరాటాలను ఆయన చులకన చేసేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి సెటైరికల్ కామెంట్లు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్న వారిని అవమానించేలా మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేశారు.
విమర్శల నేపథ్యంలో బ్రహ్మాజీ వివరణ
అయితే తన పోస్ట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో బ్రహ్మాజీ వెనక్కి తగ్గి మరో పోస్ట్ ద్వారా స్పష్టతనిచ్చారు. “ప్రతి నిరసన ప్రామాణికమైనది కాదు. కొన్ని నిజమైన వ్యథల నుంచి పుట్టుకొస్తాయి. మరికొన్ని తెరవెనుక ఉన్న స్వార్థపరులైన శక్తుల చేత నిధులు సమకూర్చబడి, నిర్వహించబడి, నిర్దేశించబడుతుంటాయి. నిజమైన అట్టడుగు స్థాయి ఉద్యమాలు గౌరవించదగినవి. కానీ, సృష్టించబడిన నిరసనలు ప్రజలకు కాకుండా కేవలం కొన్ని ఎజెండాలకు మాత్రమే సేవ చేస్తాయి.. ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తున్నా” అంటూ ఆయన పేర్కొన్నారు.
Not every protest is authentic.
Some emerge from genuine grievances.
Others are funded, organized, and directed by vested interests operating behind the scenes.
True grassroots movements deserve respect.
Manufactured ones serve agendas, not the public…
Ika Ee topic ikkadatho 🙏🏼— Brahmaji (@actorbrahmaji) October 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

