ధర్మేంద్ర ఆరోగ్య పరిస్ధితిపై వదంతులు తోసిపుచ్చిన బాబీ డియోల్
సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్ధితి బాగా లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వచ్చిన వార్తలను ధర్మేంద్ర కుమారుడు బాబీ డియోల్ తోసిపుచ్చారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, ఇంటి వద్ద ఉంటూ ఆయన వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు.
ముంబై : సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్ధితి బాగా లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వచ్చిన వార్తలను ధర్మేంద్ర కుమారుడు బాబీ డియోల్ తోసిపుచ్చారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, ఇంటి వద్ద ఉంటూ ఆయన వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు.
తన తండ్రి ఆరోగ్యంపై అభిమానులు, ఆత్మీయులు చూపుతున్న శ్రద్ధకు ధన్యవాదాలు తెలిపారు. బాబీ డియోల్ ప్రకటనతో అభిమానులు ఊరట పొందారు. కాగా ధర్మేంద్ర ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని, ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని పలు వార్తా సంస్ధల్లో కధనాలు రావడంతో సీనియర్ నటుడి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఇక బాబీడియోల్ నటించిన ఆశ్రమ్ 3 వెబ్‌సిరీస్ ఇటీవల విడుదల కాగా, తండ్రి ధర్మేంద్ర, సోదరుడు సన్నీ డియోల్‌తో కలిసి అప్నే 2లో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, రష్మికతో కలిసి యానిమల్‌లో బాబీ డియోల్ కనిపించనున్నారు. మరోవైపు ధర్మేంద్ర త్వరలో రాకీ అవుర్ రాణి కి ప్రేమ కహానీలో సందడి చేయనున్నారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అలియా భట్, షబనా అజ్మీ, జయా బచ్చన్‌లతో కలిసి ధర్మేంద్ర స్క్రీన్ షేర్ చేసుకుంటారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

