VasudevaSutham | దేవి ఫేం మాస్టర్ మహేంద్రన్ వసుదేవసుతం (Vasudheva Sutham) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. వసుదేవసుతం జులై 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన వసుదేవ సుతం దేవమ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతూ మూవీ, మ్యూజిక్ లవర్స్‌లో ఇంప్రెస్ చేస్తోంది.
తాజాగా ‘ఆనందాల వేళ’ సాంగ్‌ను ఆదిసాయికుమార్ విడుదల చేశాడు. రంగుల మధ్య కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాటను మణిశర్మ కంపోజిషన్‌లో సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల పాడారు. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా పాట ఉండబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఈ మూవీలో అంబికావాణి,జాన్ విజయ్, మైమ్ గోపీ, సురేష్ చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, భద్రమ్, జబర్థస్త్ రాంప్రసాద్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టుహింట్ ఇచ్చేస్తున్నాయి. గ్లింప్స్‌లో మాస్టర్ మహేంద్రన్ త్రిశూలాన్ని పట్టుకున్న విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితమైన నిధి సాహసం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Every melody has a heartbeat… and this one beats with pure joy. ❤️🎶#AanandhalaVela Lyrical Song Out Now!
Launched by our lovely star @iamaadisaikumar
🔗: https://t.co/rs7DDxJGFb#VasudhevaSutham Grand Release on July 10th, 2026 💥
A #ManiSharma Musical 🎶… pic.twitter.com/qM9lUUjOJs
— BA Raju’s Team (@baraju_SuperHit) July 5, 2026