బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్-రీనాదత్తాల కుమార్తె ఐరాఖాన్ గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఫిట్నెస్ ట్రైనర్ అయిన తన ప్రియుడు నుపుర్ శిఖరేను ఆమె పెండ్లి చేసుకున్నారు. ముంబయిలోని ఓ హోటల్ ఈ శుభకార్యానికి వేదికయ్యింది. ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. అమీర్‌ఖాన్, తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావుతో పాటు ముఖేశ్-నీతా అంబానీ దంపతులు తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అమీర్‌ఖాన్-రీనాదత్తాల కుమార్తెగా ఐరాఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే.