Aamir Khan Race 4 | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చాలా రోజుల తర్వాత కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ యాక్షన్ ఫ్రాంచైజీ ‘రేస్’ (Race) నాలుగో భాగంలో ఆయన నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
‘రేస్ 4’ (Race 4) స్క్రిప్ట్ ఆమిర్ ఖాన్‌కు బాగా నచ్చడంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలను ప్రముఖ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచర్యకు అప్పగించినట్లు సమాచారం. గతంలో ఆమిర్ ఖాన్, విజయ్ కృష్ణ ఆచర్య కాంబినేషన్లో వచ్చిన ‘ధూమ్ 3’ (Dhoom 3) సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్‌కి ఇవ్వబోతున్నట్లు సమాచారం. కాగా.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.