‘లగాన్’ వంటి కల్ట్‌క్లాసిక్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో అగ్ర హీరో అమీర్‌ఖాన్ చేయబోతున్న తాజా సినిమా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ‘లగాన్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ దర్శకహీరోలిద్దరూ మరో క్రికెట్ నేపథ్య చిత్రానికి సిద్ధమవుతుండటం విశేషం. స్వతంత్ర భారత్ తొలి క్రికెట్ సారథిగా, భారతీయ క్రికెట్ పితామహుడిగా కీర్తిగడించిన లాలా అమర్నాథ్ స్ఫూర్తివంతమైన జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
1947 ఇండియా-పాకిస్థాన్ విభజన కూడా కథలో కీలకాంశం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హీరాని రచయితగా పనిచేస్తున్నారు. ‘లగాన్’ టైటిల్‌ను స్ఫురించేలా ‘లాల్కార్’ టైటిల్‌ను ఖరారు చేశారని సినిమా సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.