Aamir Khan | అదే నా చివరి చిత్రం కావొచ్చు అంటూ అమీర్ కామెంట్స్.. షాక్‌లో ఫ్యాన్స్
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేయని ప్రయోగం లేదంటే అతిశయోక్తి కాదేమో. కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేసిన ఆయన ఎన్నో వెరైటీ పాత్రలు పోషించి అలరించారు. ఇప్పటికీ అదే శైలిలో నడుస్తున్నారు.
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ చేయని ప్రయోగం లేదంటే అతిశయోక్తి కాదేమో. కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేసిన ఆయన ఎన్నో వెరైటీ పాత్రలు పోషించి అలరించారు. ఇప్పటికీ అదే శైలిలో నడుస్తున్నారు. అందుకే అభిమానులు ఆయనని ముద్దుగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటుంటారు. ఆమీర్ ఖాన్ త్వరలో ‘సీతారే జమీన్ పర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్, తాను చాలా ఏళ్లుగా కలలు కంటున్న ‘మహాభారతం’ ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మహాభారతం చిత్రం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతంలో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో మలచాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ సినిమా నా కెరీర్లో చివరి సినిమా కూడా కావొచ్చు అని ఆయన తెలియజేశారు. ఇలాంటి గొప్ప కథ తర్వాత నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్ధం కాని పరిస్థితి. నాకు పని చేస్తూ చనిపోవాలని ఉంది కాని, బహుశా ఇదే చివరి సినిమా అవుతుందని ఆమీర్ అన్నారు. ఈ కామెంట్స్‌తో ఫ్యాన్స్ షాక్‌లో ఉండిపోయారు. మీరు ఎన్నో గొప్ప సినిమాలు చేయాలి, ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన చేయకండి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమిర్ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ‘హ్యాపీ పటేల్’, ‘చార్ దిన్ కీ చాందనీ’, ‘మహాభారతం’తో పాటు జోయా అక్తర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే మహాభారతం మాత్రం ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. అయితే రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినా… ఆయన ఆ వైపు అడుగులు వేయలేదు. అయితే జక్కన్న కన్నా ముందు ఆమీర్ ఖాన్ రంగంలో దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. అయితే స్క్రీప్ట్ రాయడానికి టైం పడుతుందని.. పైగా అన్ని క్యారెక్టర్లను ఒకే సినిమాలో చూపించలేం కాబట్టి… సీరిస్ గా దీన్ని తెరపైకి తీసుకొస్తానంటూ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

