Aamir Khan | చిరంజీవికి అమీర్ ఖాన్ కృతజ్ఞతలు..పోస్ట్ వైరల్
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశాడు అమీర్ ఖాన్. ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది లాల్ సింగ్ చధా (Laal Singh Chaddha).
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోసం బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (aamir khan) లాల్ సింగ్ చధా (Laal Singh Chaddha) స్పెషల్ షో వేసిన విషయం తెలిసిందే. చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ షోకు అమీర్‌తోపాటు నాగార్జున, నాగచైతన్య, సుకుమార్, రాజమౌళి హాజరయ్యారు. తెలుగులో లాల్ సింగ్ చద్దాను సమర్పించనున్నాడు చిరంజీవి. ఈ నేపథ్యంలో చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశాడు అమీర్ ఖాన్.
చిరంజీవి సార్ మాపై అమితమైన ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మేమిప్పటికీ నమ్మలేకపోతున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీ సపోర్టు అఖండమైనది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అమీర్ ఖాన్. ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా వస్తున్న లాల్ సింగ్ చధా సినిమా కోసం ఎలాంటి కష్టం పడ్డాడో అమీర్‌ఖాన్ నాతో చెప్పాడని చిరంజీవి గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య (Naga Chaitanya) బాలీవుడ్ డెబ్యూ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు చిరంజీవి. లాల్ సింగ్ చద్ధాలో కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

