Aamir Khan | కోలీవుడ్ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం ‘గట్టా కుస్తీ 2′(తెలుగులో మట్టి కుస్తీ) థియేటర్లలో భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతోంది. 2022లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘గట్టా కుస్తీ’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తమిళనాడు అంతటా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్‌తో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి నిర్మాతగా విష్ణు విశాల్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ గ్రాండ్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న విష్ణు విశాల్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నుంచి ఊహించని సర్ప్రైజ్ లభించింది. ఈ సినిమా సాధిస్తున్న బాక్సాఫీస్ విజయాన్ని చూసి ముగ్ధుడైన ఆమిర్ ఖాన్.. నేరుగా విష్ణు విశాల్‌కు వీడియో కాల్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ మధురమైన క్షణానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీడియో కాల్లో ఆమిర్ ఖాన్ ఎంతో ఎగ్జైట్మెంట్తో కంగ్రాచులేషన్స్ విష్ణు.. ఇదొక మంచి విజయం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆమిర్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడి నుంచి ప్రశంసలు దక్కడంపై విష్ణు విశాల్ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ నోట్ రాశారు. గట్టా కుస్తీ 2 బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషపడి, నాకు స్వయంగా కాల్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఆమిర్ ఖాన్ సర్ థాంక్యూ. నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, సపోర్ట్‌గా నిలుస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు అని విష్ణు పేర్కొన్నారు.
విష్ణు విశాల్, ఆమిర్ ఖాన్ల స్నేహం గురించి అందరికి తెలిసిందే. విష్ణు విశాల్ భార్య, మాజీ భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ద్వారా ఒక సాధారణ పరిచయంగా ప్రారంభమైన వీరి బంధం, కాలక్రమేణా ఒక కుటుంబ స్నేహంగా మారింది. 2023లో చెన్నై వరదల సమయంలో ఆమిర్ ఖాన్ తన తల్లి చికిత్స కోసం చెన్నైలో ఉన్నప్పుడు విష్ణు విశాల్ ఆయనకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఆ తర్వాత వీరి స్నేహం మరింత బలపడింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి మహిళా రెజ్లర్ కీర్తిగా, విష్ణు విశాల్ వీరగా తమ నటనతో అలరించారు. మొదటి భాగంలో భార్య రెజ్లింగ్ కెరీర్‌కు అండగా ఉంటానని ప్రామిస్ చేసిన వీర.. ఈ సీక్వెల్లో హౌస్ హస్బెండ్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. అయితే, కూతురి పెంపకం, కుటుంబ బాధ్యతలు, కెరీర్ ఆంబిషన్స్ మధ్య భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు వంటి అంశాలను దర్శకుడు హాస్యం, ఎమోషన్ కలగలిపి అద్భుతంగా తెరకెక్కించారు. రమ్యకృష్ణ, యోగి బాబు, కాళీ వెంకట్ వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు.
“Congratulations Vishnu. Huge blockbuster. So happy”
So excited to get a call from the one and only Aamir Khan sir who is super happy on seeing the blockbuster response to #GattaKusthi2 ❤️
Thank you Aamir sir for always being a pillar of support and having my back.. pic.twitter.com/NPgJBuuT5b
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) July 7, 2026