Aadu Jeevitham | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా చిత్రం “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా.. అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా వస్తుండగా.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. సర్వైవల్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.