వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిత్రావతి’ అనే తొలి గీతాన్ని శనివారం విడుదల చేశారు. నాయిక అందాన్ని వర్ణిస్తూ మెలోడీ ప్రధానంగా సాగిందీ గీతం.
రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా ఆలపించారు. వినసొంపైన బాణీ, చక్కటి సాహిత్యంతో ఈ గీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఆర్థర్ ఎ విల్సన్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి.