AA22xA6 movie | అల్లు అర్జున్ సినిమా మేటర్ లీక్ చేసిన బన్నీ వాసు.. రోజుకి కోట్లలో ఖర్చు
AA22xA6 movie | 'పుష్ప 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసే తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించిన బన్నీ, చివరికి డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు.
AA22xA6 movie | ‘పుష్ప 2’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసే తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించిన బన్నీ, చివరికి డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‌తో సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్‌తో సంబంధం లేకపోయినప్పటికీ, బన్నీకి సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా నిర్మాణ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
తాజాగా బన్నీ వాసు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ సినీ వర్కర్స్ సమ్మె కారణంగా చిత్రబృందం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేయాల్సి వచ్చింది. వర్కర్స్ అసోసియేషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఒకే సమాఖ్యకు చెందినవిగా ఉండటంతో, ముంబైలోనూ మా టీమ్ కొన్ని సందర్భాల్లో షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ప్రతి రోజు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ చిత్రానికి ఈ తరహా బ్రేక్స్ ఎంతో నష్టాన్ని కలిగించాయి. విదేశాల నుంచి వచ్చిన టెక్నీషియన్లకు పని లేకున్నా రోజువారీగా పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది,” అన్నారు.
“ఇది సన్ పిక్చర్స్ ప్రాజెక్ట్ కావడంతో, వారితో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. ఏదైనా సమాచారం బయటపెట్టాలంటే వారు అనుమతించాలి. అందుకే మేమంతా ఇప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తోంది,” అని నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే, ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ వంటి హాలీవుడ్ బిగ్బడ్జెట్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ కూడా ఈ చిత్రానికి పని చేస్తోంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని అంచనా. ఇక ‘పుష్ప 2’ హైప్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో బన్నీ ఫ్యాన్స్‌కి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- Bunny Vas
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

