A.R.Rehman | అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారు : ఏ.ఆర్ రెహమాన్
A.R.Rehman Sensational Comments | అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారని స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఆరోపించాడు. కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి.
A.R.Rehman Sensational Comments | అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారని స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఆరోపించాడు. కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయని రెహమాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారని, కానీ అలా చూస్తుండటం తప్ప మనం ఏమి చేయలేమని తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు. ప్రస్తుతం ఏ.ఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. అర్హత ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ పంపకపోవడంపై ఇన్‌డైరెక్ట్‌గా ఏ.ఆర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
ఇక ఎప్పుడెప్పుడా అని ఏండ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆస్కార్‌ను కీరవాణి, చంద్రబోస్‌లు తెచ్చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్తో ఆ కళ తీరిపోయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్‌ను గెలిచి తెలుగు ఖ్యాతిని ప్రపంచం శిఖరంపై నిలబెట్టింది. నిజానికి ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కలేదు. ఆర్ఆర్ఆర్కు బదులు గుజరాతి చిత్రమైన చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ ఇది ఫైనల్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దాంతో చాలా మంది సినీ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ను పంపిస్తే ఉత్తమ చిత్రం విభాగంలో కూడా ఆస్కార్ వచ్చేదని పలువురు నెటీజన్లు వ్యక్తం చేశారు. కాగా ‘చెల్లో షో’ సినిమాను గతేడాది కూడా ఆస్కార్‌కు పంపించారు. అప్పుడు కూడా ఫైనల్ నామినేషన్లో చోటు దక్కించుకోలేకపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

