మరో మహాగాయని బయోపిక్?
భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కనుండటం.. ఆ దిగ్గజ గాయని పాత్రను రష్మిక మందన్న పోషించనుండటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. తాజాగా మరో మహాగాయని కథ కూడా వెండితెరపై దృశ్యమానం కానున్నదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది.
భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కనుండటం.. ఆ దిగ్గజ గాయని పాత్రను రష్మిక మందన్న పోషించనుండటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. తాజాగా మరో మహాగాయని కథ కూడా వెండితెరపై దృశ్యమానం కానున్నదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. భారతీయ సినీసంగీతానికి తన గాత్రంతో సొగబులద్దిన గాన కోకిల పి.సుశీల బయోపిక్‌ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనేది ఆ వార్త సారాంశం. లెంజెడరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.
సుశీలమ్మ కుటుంబంతో ఏఆర్ రెహమాన్‌కి మంచి అనుబంధం ఉన్నదని, పైగా సుశీలమ్మ పాటకు రెహ్మాన్ వీరాభిమాని కావడంతో ఆయనే స్వయంగా ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారని వినికిడి. ఇక సుశీలమ్మగా ఎవరు నటిస్తారు? అనే విషయానికొస్తే.. దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను ఆ పాత్రకు ఎంపికచేశారనే ప్రచారం జరుగుతున్నది. సుశీలమ్మ ఆహార్యం, అమాయకత్వంతో కూడిన ఆమె సహజమైన రూపానికి రుక్మిణి సరైన ఛాయిస్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

