అరవింద్ కృష్ణ, అషు రెడ్డి ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. సుకు పూర్వజ్ దర్శకుడు. శ్రీకాంత్ కండ్రేగుల నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రీటీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘సమాజంలో జరిగే అన్యాయాలను, నేరాలను చూస్తూ పెరిగిన ఓ యువకుడు పెద్దయ్యాక సూపర్‌హీరో అవుతాడు.
ఆ తరువాత అతను చేసిందేమిటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే ఈ చిత్రంలో విజువల్స్ స్టన్నింగ్‌గా ఉంటాయి. ఏ న్యూ కాన్సెప్ట్ సూపర్‌హీరో మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం అందించబోతుంది’ అన్నారు.