చీకటిని ఛేదించిన వెలుగురేఖ

‘అందరు నన్ను బ్యాడ్‌లక్ సఖి అంటుంటారు. మనకి అలాంటి సోది కబుర్ల మీద నమ్మకం లేదు’ అంటూ కీర్తి సురేష్ చెప్పిన సంభాషణ హైలైట్‌గా సోమవారం విడుదలైన ‘గుడ్‌లక్ సఖి’ థియేట్రికల్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటున్నది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ‘మనదేశం గర్వపడేలా షూటర్స్‌ను తయారుచేయబోతున్నాను’ అని జగపతిబాబు చెప్పిన సంభాషణతో మొదలైన టీజర్ ఆద్యంతం స్ఫూర్తివంతంగా అనిపించింది. గ్రామంలో ఎన్నో ప్రతిబంధకాల్ని దాటుకొని సఖి అనే అమ్మాయి లక్ష్యాన్ని చేరుకోవడం ఆకట్టుకునేలా సాగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో కథానాయిక కీర్తి సురేష్ కోచ్‌గా జగపతిబాబు నటించారు. తన గ్రామస్తులతో బ్యాడ్‌లక్ సఖి అనిపించుకున్న ఓ సాధారణ యువతి జాతీయ స్థాయి షూటింగ్లో రాణించి గుడ్‌లక్ సఖిగా ఎలా నీరాజనాలు అందుకుందో ఈ సినిమాలో ఆవిష్కరించామని చిత్రబృందం తెలిపింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్‌చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిరంతాన్దాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

