7/G Brindavan Colony | 7/G బృందావన్ కాలనీ రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ట్రెండ్‌కు తగ్గట్లు భలే కట్ చేశారు..!
7/G Brindavan Colony | సెప్టెంబర్ 22న రీ-రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ తెగ వేయిట్ చేస్తున్నారు. పైగా ఆ వారం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు.
7/G Brindavan Colony | దశాబ్దాల సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథల కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకొనేది 7/G బృందావన్ కాలనీ. నిజానికి ఇదొక తమిళ సినిమా. కానీ తెలుగులో కోలీవుడ్ మించి విజయం సాధించింది. సినిమా వచ్చి పంతొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే స్క్రీన్కు అతుక్కుపోతుంటాం. అంతలా చెదరిపోని జ్ఞాపకాలు మిగిల్చింది. ముఖ్యంగా సినిమా రిలీజప్పుడు యూత్‌లో ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. వారం పాటు థియేటర్లలో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాంటి కల్ట్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుందంటే ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు.
సెప్టెంబర్ 22న రీ-రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ తెగ వేయిట్ చేస్తున్నారు. పైగా ఆ వారం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు ట్రైలర్‌ను బాగా కట్ చేశారు. మరీ ముఖ్యంగా సినిమాలోని ఆల్ టైమ్ ఫేవరైట్ సీన్లన్ని ఒక చోట చేర్చి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించారు. ఏఎమ్ రత్నం చిన్న కొడుకు రవి కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు సెల్వా రాఘవన్ దర్శకుడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో సెల్వా రాఘవన్ ఉన్నట్లు చెన్నై టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో కూడా మునిగిపోయాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

