December Last Week Movies | మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ప్రభావం కనిపించిన.. ఆ తర్వాత మెల్లిగా కోవిడ్ పక్కదారి పట్టడంతో కుప్పకుప్పలుగా సినిమాలు రిలీజైయ్యాయి. ప్రతీ వారం ఒకటి, రెండు పెద్ద సినిమాలతో పాటు మూడు, నాలుగు చిన్న సినిమాలు రిలీజై ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రతీ ఏడాది డిసెంబర్లో ఒక్కటైనా బ్లాక్ బస్టర్ మూవీ ఉండేది. అయితే ఈ ఏడాది మొన్నటి వరకు ఒక సాలిడ్ హిట్ లేక బాక్సాఫీస్ తేలిపోయింది. ఎంట్రా ఈ డిసెంబర్ చప్పగా సాగుతుంది అని అనుకుంటున్న టైమ్‌లో ‘ధమాకా’తో రవితేజ ఫైర్ క్రాకర్ వెలిగించాడు. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం అదరిపోతున్నాయి. ఈ సినిమాకు పోటీగా వచ్చిన ’18పేజీస్’, రెండు అరవ డబ్బింగ్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతున్నాయి. ఇక డిసెంబర్లో లాస్ట్ శుక్రవారం కుర్ర హీరోలు బుక్ చేసుకున్నారు. 2022కు గ్రాండ్‌గా ముగింపు పలుకుతామంటూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరీ ఈ ఏడాది లాస్ట్ వారంలో రిలీజైయ్యే థియేటర్, ఓటీటీ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
టాప్‌గేర్:
ఫలితం ఎలా ఉన్నా ఆది సాయికుమార్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆది నటించిన నాలుగు సినిమాలు రిలీజైయ్యాయి. ఇక ఇప్పుడు 2022కి సెండాఫ్ ఇవ్వడానికి ‘టాప్‌గేర్’తో వస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 30న రిలీజ్ కానుంది.
లక్కీ లక్ష్మణ్:
బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ అభి దర్శకత్వం వహించాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. పేరుకు చిన్న సినిమానే అయిన.. కంటెంట్ పరంగా పెద్ద సినిమాతో రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది.
డ్రైవర్ జమున:
గ్లామర్ రోల్స్‌కు అతీతంగా నటన ప్రాధన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఐశ్వర్య రాజేష్. ఆమె ప్రధాన పాత్రలో నటించని లేటెస్ట్ చిత్రం డ్రైవర్ జమున. మహిళా ప్రధానంగా సాగే ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొల్పాయి. అయితే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడువుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
వీటితో పాటుగా నందమూరి తారకరత్న, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎస్5’ మూవీ కూడా అదే రోజున థియేటర్లలో రిలీజ్ కానుంది. సాయి రోనక్, అంకితా సాహా జంటగా నటించిన ‘రాజయోగం’ మూవీ కూడా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇవేకాకుండా ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ దేవరకొండ’ డిసెంబర్ 30, ‘కొరమీను’ డిసెంబర్31న విడుదల కానున్నాయి.
ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
అమెజాన్ ప్రైమ్:
► గోల్డ్ – డిసెంబర్ 29
నెట్‌ఫ్లిక్స్:
► 7 ఉమెన్ అండ్ మర్డర్ – డిసెంబర్ 28
► డీఎస్పీ(తెలుగు డబ్బింగ్ చిత్రం) – డిసెంబర్ 30
► వైట్ నాయిస్ – డిసెంబర్ 30
► చోటా భీమ్ సీజన్ 15 – డిసెంబర్ 30
► ద గ్లోరీ(కొరియన్ సిరీస్) – డిసెంబర్ 30
ఆహా:
► అన్‌స్టాపబుల్ షో (ప్రభాస్ ఎపిసోడ్) – డిసెంబర్ 30
హాట్‌స్టార్:
► బటర్‌ఫ్లై – డిసెంబర్ 29
► ఆర్ యా పార్ – డిసెంబర్ 30
► ది ఎల్ వరల్డ్ – డిసెంబర్ 30
► బ్యూటీ అండ్ ది బీస్ట్ – డిసెంబర్ 30
జీ5
► ఉత్తవారన్ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్ 30