2021 సంవత్సరం మరి కొద్ది రోజులలో ముగియనుంది. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పే క్రమంలో పాత సంగతులని కూడా నెమరువేసుకుంటున్నారు. అన్ని వర్గాల వాళ్ళు ఈ ఏడాదిలో జరిగిన స్వీట్ మెమోరీస్, బాధాకరమైన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. బిజినెస్ గురించి, సినిమా గురించి, ఏ రంగంలో నైనా 2021లో జరిగిన విషయాల గురించి చర్చించుకుంటున్నారు.
సినిమా రంగం విషయానికి వస్తే 2021 సంవత్సరం లో ఎక్కువగా ట్వీట్ చేసిన చిత్రాల గురించి ఓ వార్త బయటకు వచ్చింది. 2021లో మాస్టర్, వలిమై, బీస్ట్, జై భీమ్, వకీల్ సాబ్ చిత్రాల గురించే నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు చేశారు. వీటిలో వకీల్ సాబ్ మాత్రమే తెలుగు చిత్రం, మిగతావన్నీ తమిళ సినిమాలే. ఈ చిత్రాల్లో కూడా విజయ్ సినిమాలే రెండు ఉండటం విశేషం.
ఈ సంవత్సరం ఎక్కువగా సెర్చ్ చేసిన ఐదు సినిమాల్లో జైభీమ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత షేర్షా, రాధే, బెల్ బాటమ్ మరియు ఎటర్నల్స్ ఉన్నాయి. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్ భారతదేశంలో ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన చిత్రంగా నిలిచింది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమాలో లిజోమోల్ జోస్, మణికంఠలు నటించారు.