బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురువారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలందజేశారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ‘నేను మిమ్మల్ని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మీరు మాతో పంచుకున్న జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు విజయ్ దేవరకొండ.
ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రంలో మైక్‌టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మైక్ టైసన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయనకు విషెస్ తెలుపుతూ ‘లైగర్’ టీమ్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో అమెరికా షూటింగ్ సందర్భంగా ‘లైగర్’ టీమ్ మైక్ టైసన్‌తో పంచుకున్న అనుభూతుల్ని పొందుపరిచారు. ఈ చిత్రంలో అనన్యపాండే కథానాయికగా నటిస్తున్నది. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.