Small Savings | స్మాల్ సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడులు.. సెప్టెంబర్‌లోగా ఆధార్ కార్డు అనుసంధానం..లేదంటే ఇవీ పరిణామాలు..!
Small Savings Schemes | ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు సెప్టెంబర్ లోగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సిందే. లేదంటే ఆయా ఖాతాలను బ్యాంకులు, పోస్టాఫీసు స్తంభింపజేస్తాయి.
Small Savings | మీరు పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్), ఇతర పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టారా.. ఇప్పటికీ మీరు సంబంధిత బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ మీ ఆధార్ కార్డ్ అందజేయలేదా.. వచ్చే సెప్టెంబర్ 30 లోపు మీరు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన బ్యాంకులు లేదా పోస్టాఫీసులు తప్పనిసరిగా ఆధార్ కార్డు అందజేయాలి. ఆ తేదీలోగా ఆధార్ సబ్మిట్ చేయకుంటే ఆధార్ కార్డు వివరాలు సమర్పించే వరకు మీ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడుల వివరాలన్నీ స్తంభింప చేస్తాయి బ్యాంకులు, పోస్టాపీసు.
ఇప్పటికే చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ఖాతాలు ప్రారంభించిన వారు ఆధార్ కార్డు వివరాలను సంబంధిత పోస్టాఫీసులో గానీ, బ్యాంకు శాఖలో గానీ సమర్పించకపోవచ్చు. అలా సమర్పించని వారు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆరు నెలల్లో ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలని గత నెల 31న విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అంటే సెప్టెంబర్ 30 లోగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఖాతాలు తెరిచిన వారు తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలు అందజేయాల్సి ఉంటుందని వెల్లడించింది. అలా ఆధార్ కార్డు ప్రతి సమర్పించని పెట్టుబడుల ఖాతాలు స్తంభింప చేస్తామని పేర్కొంది.
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్మెంట్లకు ఆధార్, పాన్ కార్డులు సమర్పించడం తప్పనిసరి అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా పథకాల్లో తమ డబ్బు పొదుపు చేసిన వారు ఆధార్, పాన్ కార్డులను అనుసంధానించాలని గత నెల 31న జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. అలా ఆధార్, పాన్ కార్డులతో అనుసంధానించకుంటే సమస్యలు ఎదురవుతాయి. ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానానికి జూన్ 30 వరకు కేంద్రం గడువు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఆయా చిన్న మొత్తాల పథకాల్లో పెట్టుబడులపై వడ్డీ ఆదాయం మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో క్రెడిట్ కాదు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి పథకాల్లో ఇనెస్ట్‌మెంట్ అనుమతించరు. ఆయా పొదుపు పథకాల్లో పెట్టుబడులు మెచ్యూర్ అయినా సదరు మెచ్యూర్ మొత్తం మీ ఖాతాల్లో జమ కాదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

