WPI inflation | 2005 ఏప్రిల్ స్థాయికి హోల్సేల్ ద్రవ్యోల్బణం!
WPI inflation | గత నెల హోల్సేల్ ద్రవ్యోల్బణం 12 ఏండ్ల గరిష్ఠస్థాయికి 14.23 % చేరుకున్నది. 2005 ఏప్రిల్ తర్వాత ఇంత గరిష్టం ఇదే ఫస్ట్.

WPI inflation | గత నెల హోల్సేల్ ద్రవ్యోల్బణం 12 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నది. గత అక్టోబర్ నెలలో 12.54 శాతంగా నమోదైన హోల్సేల్ ద్రవ్యోల్బణం.. నవంబర్లో 14.23 శాతానికి చేరుకున్నది. హోల్సేల్ ద్రవ్యోల్బణం వరుసగా ఎనిమిదో నెలలోనూ డబుల్ డిజిట్స్ దాటింది. సహజవాయువు, కెమికల్స్, ఇంధనం, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్ ధరలు భారీగా పెరగడం వల్లే ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరుకున్నది. 2005 ఏప్రిల్ తర్వాత హోల్సేల్ ద్రవ్యోల్బణం ఇంత గరిష్ఠ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారి.
ఫ్యూయల్, విద్యుత్ రంగాల్లో ద్రవ్యోల్బణం 39.81 శాతం కాగా, ఆహార పదార్థాల ధరలు రెండింతలయ్యాయి. ఫ్యూయల్, విద్యుత్ ధరలు పెరగడం వల్లే నవంబర్ హోల్సేల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇక గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరుకున్నది. అక్టోబర్లో 4.48 శాతంగా ఉండగా, నవంబర్లో 4.91 శాతంగా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

