Wipro | ఫ్రెషర్స్‌కు బంపర్ ఆఫర్.. విప్రో ఐదేండ్ల వేతన ప్యాకేజీ.. అందుకేనా?
Wipro | ఫ్రెషర్స్‌కు ఐటీ దిగ్గజం విప్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాంపస్ రిక్రూటీలకు ఐదేండ్ల వేతన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నది
Wipro | ఫ్రెషర్స్‌కు ఐటీ దిగ్గజం విప్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాంపస్ నియామకాల్లో నియమితులైన నిపుణులకు ఐదేండ్ల వేతన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నది. వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లతోపాటు పలు బెనిఫిట్లు కల్పిస్తామని తెలిపింది. ఇప్పటికే మూన్ లైటింగ్‌కు పాల్పడుతున్న ఐటీ నిపుణులను గుర్తించి, వారి ఆట కట్టించేందుకు చర్యలు చేపడుతున్నది. మూన్ లైటింగ్‌లో స్టార్టప్‌లతో పని చేస్తున్న నిపుణుల ప్రావిడెండ్ ఫండ్ వివరాలను చెక్ చేస్తున్నట్లు పేర్కొన్నది. మూన్ లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను కనిపెట్టేందుకు పలు రకాల పద్దతులు అవలంభిస్తున్నామని విప్రో వెల్లడించింది. పరిహార కోణాన్ని, కెరీర్‌ను పరిగణనలోకి తీసుకుని చాలా స్పష్టంగా ఐదేండ్ల వేతన ప్యాకేజీ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సంబంధిత క్యాంపస్ రిక్రూటీలకు సమాచారం ఇచ్చామని తెలిపింది.
క్యాంపస్ రిక్రూట్మెంట్లలో నియమితులైన వారి వేతనం వచ్చే ఐదేండ్లలో ఎలా పెరుగుతుందో వివరిస్తూ ఆఫర్ లెటర్లలో పేర్కొంటున్నట్లు విప్రో పేర్కొంది. వేతన ప్యాకేజీపై చాలా నమ్మకంతో కూడిన హామీని ఫ్రెషర్స్‌కు ఇస్తున్నట్లు విప్రో చీఫ్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరవ్ గోవిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విభిన్న బోనస్‌లతోపాటు వేతనాల పెంపు తదితర వివరాలు ఆ ఆఫర్ లెటర్లలో ఉంటాయని తెలిపారు. దేశంలోని అత్యధిక ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో క్యాంపస్‌ల్లో కొత్త నియామకాలు చేపడుతుంటాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో సుమారు 15 వేల మందిని విప్రో నియమించుకున్నది. సంస్థలో 85 శాతం మంది ఉద్యోగులు 100 శాతం వేరియబుల్ పే కాంపొనెంట్లోకి వస్తారు. మూన్ లైటింగ్‌కు పాల్పడే వారి పట్ల విప్రో కొరడా ఝుళిపిస్తున్నది. ఇప్పటికే 300 మందిని ఇంటికి సాగనంపింది. భవిష్యత్‌లో ఐటీ, డిజిటల్, సైబర్ సేవలకు గిరాకీ పెరగనుండటం, అట్రిక్షన్లు పెరిగిపోతుండటంతో విప్రో.. కొత్తగా నియమితులయ్యే ఫ్రెషర్స్ వేతనాల పెంపునకు ఐదేండ్ల ప్రణాళిక రూపొందిస్తుండటం ప్రాధాన్యం ఏర్పడింది.
అన్ని రకాల ఆఫర్లు అందిస్తున్న విప్రో.. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దశల వారీగా ఈ ఆఫర్లు అమలు చేస్తున్నది. ఇదిలా ఉంటే డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో అట్రిక్షన్లు (వలసలు) తగ్గుముఖం పడతాయని సౌరవ్ గోవిల్ చెప్పారు. ప్రతిభావంతుల కొరతను నివారించడానికి అట్రిక్షన్లు సుమారు 20 శాతం ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో విప్రోలో 23 శాతం అట్రిక్షన్ నమోదైంది. టీసీఎస్‌లో రెండో త్రైమాసికంలో 21.5-, తొలి త్రైమాసికంలో 19.7, హెచ్‌సీఎల్ టెక్నాలజీలో 23.8 శాతం అట్రిక్షన్లు రికార్డయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

