స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

గత నెలలో 13.56 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, జనవరి 14: డిసెంబర్ నెలలో టోకు ధరల స్పీడ్ కాస్త తగ్గింది. ఏ నెలకు ఆ నెల వరుసగా నాలుగు నెలల నుంచి పెరిగిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 2021 డిసెంబర్లో 13.56 శాతానికి తగ్గింది. అదే ఏడాది నవంబర్లో ఇది 14.23 శాతంగా ఉంది. 2020 డిసెంబర్లో డబ్ల్యూపీఐ 1.95 శాతమే. టోకు ధరల్లో వృద్ధి కాస్త తగ్గిన కారణంగా వచ్చే నెల ఫిబ్రవరిలో రిజర్వ్బ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతుందన్న అంచనాల్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. క్రూడ్, సహజవాయువు, లోహాలు, రసాయినాలు, రసాయిన ఉత్పత్తులు, ఆహార్పోత్తులు, జౌళి, కాగిత ఉత్పత్తుల ధరలు అధికంగా పెరిగాయి.
23 నెలల గరిష్ఠానికి ఆహార ద్రవ్యోల్బణం
2021 డిసెంబర్లో నవంబర్కంటే డబ్ల్యూపీఐ పరిమితంగా వృద్ధిచెందినప్పటికీ, ఆహారోత్పత్తుల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ విభాగపు ద్రవ్యోల్బణం 9.56 శాతంగా నమోదయ్యింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

