Sourav Gangulay | బంధన్ బ్యాంకు ప్రకటనలో గంగూలీ.. అతని కెరీర్, బ్యాంకు వృద్ధిని హైలైట్ చేస్తున్న యాడ్
చంద్రశేఖర్ ఘోష్ 2001లో బంధన్ బ్యాంకు స్థాపించాడు
Sourav Gangulay : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బ్యాంకు ప్రకటనలో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. బంధన్ బ్యాంకు కొత్త యాడ్‌లో గంగూలీ నటించాడు. క్రికెటర్‌గా దాదా కెరీర్, అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన బంధన్ బ్యాంక్ మధ్య ఉన్నసంబంధాన్ని కళ్లకు కట్టేలా ఈ ప్రకటన రూపొందించారు. తక్కువ కాలంలో సంపాదించిన వినియోగదారుల నమ్మకాన్ని శాశ్వతం చేయాలని కోరుతుంది. బంధన్ ఎక్కడ ఉంటే.. అక్కడ నమ్మకం ఉంటుంది అనేది ఈ ప్రకటన ట్యాగ్‌లైన్.
వీడియోలో.. మైదానంలో తన జర్నీని గంగూలీ వివరిస్తాడు. ‘మొదట్లో నేను తక్కువ పరుగులు చేసేవాడిని. దాంతో, స్టేడియంలోకి ప్రేక్షకులు కూడా తక్కువ వచ్చేవాళ్లు. దాంతో, నా గేమ్‌ను మెరుగుపరుచుకునేందుకు బాగా కష్టపడ్డాను. రన్స్ స్కోర్ చేశాను. దాంతో ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. నేను నిలకడగా పరుగులు చేసే కొద్దీ స్టేడియం నిండిపోయేది. మైదానంలో రికార్డులు బద్దలు కొట్టాను. అభిమానుల నమ్మకం సంపాదించాను. అలా సౌరవ్ గంగూలీ నుంచి దాదాగా మారాను. అంచనాలను అందుకున్నప్పుడు’ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం సాధ్యమే. నమ్మకం వల్ల బంధం ఏర్పడుతుంది. ఎలాగంటే.. బంధన్ బ్యాంకులా’ అని గంగూలీ చెప్తాడు.
‘బంధన్ బ్యాంకు కస్టమర్ల నమ్మకం సంపాదించడంలోఏళ్ల తరబడి అలుపెరగని ప్రాధమ్యాలు, చెక్కు చెదరని అంకితభావం, కట్టుబడిన సిద్ధాంతాలు ఉపయోగపడ్డాయి’ అంటూ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. బంధన్ బ్యాంకును చంద్రశేఖర్ ఘోష్ 2001లో స్థాపించాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న దాదా మళ్లీ గ్రౌండ్లో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా గంగూలీ సేవలు అందించనున్నాడు. 2019లోనూ గంగూలీ ఆ ఫ్రాంఛైజీ మెంటర్‌గా ఉన్నాడు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

