పర్సనల్ లోన్‌కు ఎప్పుడెళ్లాలి

‘మీకు పర్సనల్ లోన్ కావాలా?’ అంటూ ఫోన్ రాని రోజులు మనకు లేవంటే అతిశయోక్తి కాదు. ఫోన్ల మీద లోన్ అప్రూవలై డబ్బు మన బ్యాంకు ఖాతాల్లో పడుతున్న రోజులివి. వ్యక్తిగత రుణం అంటే వెంటనే చేతికి అందివచ్చేది. మన అవసరాలు ఎలాంటివైనా ఉపయోగపడేది. హౌజింగ్ లోన్, వాహన రుణాల మాదిరి కాకుండా వీటికి చాలా వెసులుబాటు ఉంటుంది. అడగ్గానే చేతికందివచ్చే ఈ పర్సనల్ రుణాలు మిగతా రుణాలతో పోల్చితే చాలా ఖరీదైనవి. ఎలాంటి తనఖాలు లేకుండానే వచ్చే ఈ రుణాలపై ఇతర రుణాలతో పోల్చితే వడ్డీరేట్లు ఎక్కువ. అయితే వ్యక్తిగత రుణం తీసుకునే ముందు కొన్ని అంశాలను చాలా నిశితంగా పరిశీలించాలి. ఏ అవసరం కోసం తీసుకుంటున్నామో స్పష్టత ఉంటే ఆ తర్వాత సమస్యలుండవు. అలాగే పర్సనల్ లోన్ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరిగినా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇక ఈ రుణంతో మనం కొనుగోలు చేసిన వస్తువు లేదా ఆస్తి విలువ పెరుగుతూ ఉంటే చెల్లించే అధిక వడ్డీ కొన్ని రోజుల తర్వాత తీరిపోతుంది. ఎలాంటి సందర్భంలో దేని కోసం పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుందో చూద్దాం.
అత్యవసర పరిస్థితులు
మెడికల్, ఫ్యామిలీ తదితర అత్యవసర పరిస్థితుల కోసం లేదా ఉద్యోగం కోల్పోయినప్పడు అప్పటికప్పుడు వచ్చే అవసరాల కోసం పర్సనల్ లోన్‌ను తీసుకోవచ్చు. డబ్బులు లేక సతమతవుతున్నప్పుడు ఈ లోన్ కాస్త ఊరటనిస్తుంది. అయితే ఎమర్జెన్సీ ఫండ్‌ను సమకూర్చుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం ఇంకా మంచిది.
ఇంటిని చక్కదిద్దడానికి
ఇంటిని చక్కదిద్దడానికి లేదా రినోవేషన్‌కు పర్సనల్ లోన్‌ను వినియోగిస్తే దానికి ఆర్థిక పరమార్థం ఉంటుంది. ఇంటిని రినోవేషన్ చేయడం వల్ల ఇంటి విలువ పెరుగుతుందనుకున్న సందర్భంలోనూ, అలాగే దాని కోసం సరిపడా నిధులు లేనప్పడు వ్యక్తిగత రుణం తీసుకోడంలో తప్పు లేదు. అర్జంటుగా చేయాల్సిన రిపేర్ల వంటి వాటినీ పర్సనల్ లోన్ సహాయంతో చేయవచ్చు. అయితే హౌజింగ్ లోన్‌కు టాప్అప్ లోన్ తీసుకుంటే అతి తక్కువ వడ్డీకే రుణం లభించవచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని పరిశీలించండి. అయితే ఈ సౌకర్యం కొన్ని షరతులకు లోబడి ఉంటుంది.
ప్రొఫెషనల్ కోర్స్ సర్టిఫికేషన్ కోసం
ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ కోర్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల కోసం పర్సనల్ లోన్‌ను తీసుకోవచ్చు. మీ కోసం లేదా పిల్లల కోసం వాడుకోవచ్చు. దానివల్ల కెరీర్ అవకాశాలు మెరుగుపడటానికి దోహద పడుతుంది. ప్రమోషన్లు రావడంలో ఉపయోగపడుతుంది. తీసుకుంటున్న పర్సనల్ లోన్ మీరు ఒక ప్రయోజనాన్ని ఆశించే తీసుకున్నట్టు అవుతుంది. ప్రమోషన్ కాకపోతే మరో మంచి ఉద్యోగం అధిక వేతనంతో లభించేందుకు సహాయపడుతుంది. తద్వారా పొందే ప్రయోజనాలు.. మనం పర్సనల్ లోన్ మీద చెల్లించే వడ్డీని భారం కానివ్వవు. కాబట్టి ఇది వివేకమైన నిర్ణయమే.
క్రెడిట్ కార్డు రుణాలను తీర్చడానికి
క్రెడిట్ కార్డుల మీద ఉన్న రుణాలను తీర్చడానికి పర్సనల్ లోన్ తీసుకోవడంలో ఔచిత్యం ఉన్నది. ఇందుకు మూడు కారణాలను మనం ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఒకటి.. క్రెడిట్ కార్డుల మీద చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి సగటున 45 శాతం వరకు క్రెడిట్ కార్డు కంపెనీలు వడ్డీని చార్జీ చేస్తాయి. అయితే పర్సనల్ లోన్లు 18 శాతం అంతకంటే తక్కువ వార్షిక వడ్డీకే లభిస్తాయి. క్రెడిట్ కార్డ్ రుణాన్ని పర్సనల్ లోన్ ద్వారా చెల్లిస్తే అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. రెండోది.. అధిక వడ్డీ రుణాలను తీర్చడానికి పర్సనల్ లోన్‌ను ఉపయోగించడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. మూడోది.. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డు బకాయిలను పర్సనల్ లోన్‌తో తీర్చేస్తే అనేక రుణాలు కాకుండా ఒకే ఒక రుణానికి నెలసరి వాయిదాలు చెల్లించవచ్చు. అయితే క్రెడిట్ కార్డుల మీద వడ్డీరేట్లను, పర్సనల్ లోన్ వడ్డీరేట్లతో పోల్చి చూసుకోవడం మంచిది. రెండింటికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం ఉత్తమం.
ఎప్పుడు తీసుకోవద్దు
- దినసరి ఖర్చులు
నిత్యావసర సరుకుల కోసం, ఇంటి అద్దె చెల్లింపులు వంటి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో ఉన్నారంటే మీరు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు అర్థం. వ్యక్తిగత రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తిరిగి చెల్లించకపోతే లేదా ఒక్క ఈఎంఐ ఆలస్యమైనా జరిమానాలు పడడంతోపాటు క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. - లైఫ్ ైస్టెల్ ఖర్చులు
విహారయాత్రల కోసం, ఫర్నీచర్ లేదా గాడ్జెట్స్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం సముచితమే అని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు. విలాసాలకు, వినియోగానికి సంబంధించిన ఖర్చులన్నీ సొంత సొమ్ముతోనే భరించాలి. మొదటి నుంచి పొదుపు చేసి వాటిని పొందడం మంచిది. ఈ విలాసాలను అప్పు చేసి తీర్చుకోవడం ఏ మాత్రం అనుసరించదగ్గది కాదు. - ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్
ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రపంచానికి కొత్త అయితే పర్సనల్ లోన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పు తీసుకోవడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. తక్కువ రిస్క్ ఉండే ఇన్వెస్ట్మెంట్ల మీద ట్యాక్స్, ద్రవ్యోల్బణం అడ్జస్ట్ చేస్తే వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. అవి మీ వడ్డీ చెల్లింపుల కన్నా ఎక్కువ కాదు. ఇక ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్లలో రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి అప్పు చేసి మదుపు చేయడం సరైన నిర్ణయం కాదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

