WhatsApp Banking | ఈ టాప్ బ్యాంకుల్లో వాట్సాప్ బ్యాంకింగ్.. సేవల వివరాలివి!
Whatsapp Banking | డిజిటల్ బ్యాంకింగ్ సేవల అప్‌గ్రెడేషన్‌లో వాట్సాప్ బ్యాంకింగ్ ఖాతాదారులకు అనుకూలమైన ఆప్షన్ కానున్నది.
WhatsApp Banking | ఇంతకుముందు బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయాలన్నా.. ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా.. ఏ ఇతర సేవల కోసమైనా ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ వారంలో ప్రతి రోజూ 24 గంటలు బ్యాంకింగ్ లావాదేవీలను అనుమతిస్తుండటంతో ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్.. ఒక వర ప్రదాయినిగా మారింది. ఇంటి వద్ద గానీ, ఆఫీసులో గానీ కూర్చుని నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్ మీద దాదాపు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ అప్‌గ్రెడేషన్‌లో వాట్సాప్ బ్యాంకింగ్ ఖాతాదారులకు అనుకూలమైన ఆప్షన్‌గా మారనున్నది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకుల ఖాతాదారులు వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్‌ల్లో సైన్అప్ కావచ్చు.
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ ఇలా
ఇటీవలే తన ఖాతాదారుల కోసం ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించింది. వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తమ నగదు నిల్వలు, మినీ స్టేట్మెంట్ వంటి సర్వీసులు పొందొచ్చు. బ్యాంక్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా `Hi` అనే మెసేజ్ 90226 90226 అనే నంబర్‌కు పంపితే ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్‌లో సైన్అప్ కావచ్చు. అటుపై బ్యాలెన్స్ ఎంక్వైరీ (ఖాతా నిల్వ), మినీ స్టేట్మెంట్ వంటి సర్వీసులు పొందొచ్చు.
90కి పైగా సేవలందిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా 90 ప్లస్ సేవలందిస్తున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చాట్ బ్యాంకింగ్ అనే పేరుతో సేవలు అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా 70700 22222 అనే ఫోన్ నంబర్‌కు `Hi` అనే మెసేజ్ పంపడంతో వాట్సాప్ బ్యాంకింగ్ సైన్అప్ కావచ్చు. అటుపై తమకు అవసరమైన సేవలు పొందొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంకులో ఇన్స్టంట్ లోన్లకూ అప్లై చేయొచ్చు
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు వాట్సాప్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ద్వారా ఇన్స్టంట్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్‌స్టా సేవ్, ఫిక్స్డ్ డిపాజిట్ల చెల్లింపులు, బిల్లుల పేమెంట్స్, ట్రేడ్ సర్వీసులు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, చెక్‌బుక్ డెలివరీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సేవలకు ఇలా
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ముందుకు సాగుతున్నది. సురక్షితమైన, భద్రతతో కూడిన సేవల కోసం `న్యూ డిజిటల్ డెలివరీ చానెల్ – వాట్సాప్ బ్యాంకింగ్` ప్రారంభిస్తున్టన్లు తెలిపింది.
ఇలా యాక్సిస్ బ్యాంక్ వాట్సాప్ సేవలు
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు కూడా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ సేవలు, ఖాతా సంబంధ సర్వీసులు.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్స్, చెక్‌బుక్‌లకు ఆర్డర్, ఓపెన్ వీడియో కేవైసీ ఇన్స్టంట్ సేవింగ్స్ అకౌంట్స్, బ్లాక్ డెబిట్ కార్డు తదితర సేవలు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

