Vivo Y100A | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. దేశీయ మార్కెట్లోకి ‘వివో వై100ఏ (Vivo Y100A)’ ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో ఆవిష్కరించిన వివో వై100 కంటే స్వల్పంగా భిన్నమైన మోడల్ ఫోన్. వివో వై100 ఏ (Vivo Y100A) 6.38-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే విత్ 90 హెర్ట్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. 1300-నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. హెచ్డీఆర్10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. సూర్య కాంతి పడితే ఫోన్ రేర్ ప్యానెల్ రంగు మారుతుంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో రెండు కెమెరా రింగ్‌లు ఉంటాయి.
వివో వై100ఏ (Vivo Y100A) ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నది. 8జీబీ రామ్‌తో వస్తున్న ఈఫోన్లో 8జీబీ వర్చువల్ రామ్ పెంచుకోవచ్చు. 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. వివో వై100ఏ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది.
5జీతోపాటు 4జీ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూ టూత్ వీ 5.1, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వివో వై100 ఏ ఫోన్ మూడు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్, పసిఫిక్ గోల్డ్ రంగుల్లో అందుకోవచ్చు. అయితే, ఇంకా దాని ధర ఎంత, ఎప్పటి నుంచి సేల్స్‌కు అందుబాటులో ఉంటుందన్న సంగతి వెల్లడించలేదు.